Raitula kastalu kanniti gadhalu
*రైతు… ఎండనక, వాననక, అప్పుచేసి, తాకట్టులు పెట్టి , రెక్కలు ముక్కలు చేసి కష్ట పడి శ్రమించి, ప్రపంచానికి తిండి పెట్టే దేవుడు వంటి వాడు అలాంటి రైతుని కనీసం మనిషిలాగ కూడా గుర్తించడం లేదు. దేవుడి లాంటి రైతుల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1.సొంతభూమిని చేసే రైతులు
2.కౌలుకు భూమిని చేసే రైతులు
*సొంతభూమిని చేసే రైతులు ఎంతో కొంత లాభపడే అవకాశాలు వున్నాయి అది వర్షాలు రాకుండా గాలులు తగలకుండా ఉంటే లాభాన్ని చూడగలరు .
*భూస్వాముల దగ్గర అస్సలు పొలం లేకుండా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే రైతులు ఆ పొలం పండిన పండకున్న వర్షాలు వచ్చిన వాళ్ళ యజమానులకు కౌలు ఇవ్వాల్సి ఉంటది .ఇవ్వలేని పక్షనా వాళ్ళ ఇంటిని అమ్మి ఇవ్వాల్సి ఉంటది.
అస్సలు పంటలు పండకున్న అకాల వర్షాల కారణం గ పంటలు నాశనం అయినా సందర్భంలో
*ప్రభుత్వం అందించాల్సిన సహకారాలు

ప్రభుత్వం పండిన కాస్త పంటకు అయినా తగిన మద్దతు ధర ఇచ్చి ఉండాల్సిన రేట్ కన్నా ఎక్కువ రేట్ ఉండేలా చూసి సొంత భూమిని చేసే వారికీ కౌలు భూమిని చేసే వారికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.
పంట నష్టం జరిగినపుడు నష్టపరిహారం ఏంతో కొంత చెల్లిస్తే రైతుల కష్టాలు తీరుతాయి . అంటే కాకుండా రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి మన దేశంలో పేద రికాన్ని రూపు మాపగలం.

పండించే రైతులకి 100 kg ల వడ్లకు 1800 రూపాయలు
పండించిన పంటను తక్కువ రేట్ కి కొని 100kg ల బియ్యాన్ని 4000 లేదా 5000 కి అమ్ముతున్నారు
ఎక్కడ జరుగుతుంది న్యాయం పాపం రైతులకి మొత్తం దోచుకుంటుంటే
అందరు మేల్కొనండి రైతుల కష్టాలను గుర్తించండి . దయచేసి రైతుల ఆత్మహత్యలను ఆపండి ప్రబుత్యనికి కనువిప్పు కలిగించండి . ఒక వేళా రైతులలంతా వ్యవసాయం చెయ్యమని కూర్చుంటే భారత దేశ ప్రజలు అంత ఆకలి సావులు చావాల్సి వస్తది . ప్రబుత్యమా కాలు తెరువు .