( మన మానవులు ఎదిగి పెద్దయ్యాక కుక్క అయిన అమ్మకు చేసిన ద్రోహం)

ఒక వూరిలో ఒక రాజు ఉండేవాడు ,అతను చాలా మంచి వాడు కానీ అతని భార్య మంచిది కాదు .
రాజు గారికి ఒక కుక్క వుంది . అదేంటో రాజు గారి భార్య మరియు ఆ కుక్క ఒకే సారి ప్రెగ్నెంట్ అవుతారు.
రాజు గారు వూరిలో లేని సమయం లో రానికి పాయసం తినాలనిపిస్తుంది . అయితే దానికి కుక్క సహాయం తీసుకుంటుంది కుక్క కూడా ప్రెగ్నెంట్ కావడం తో తనకు కూడా పాయసం తినాలనిపిస్తుంది . ఇద్దరు కలిసి అనుకుంటారు అయితే కుక్క షాప్ దగ్గరికి పోయి బెల్లం ,పాలు అన్ని తీసుకోని వస్తుంది . కస్టపడి కట్టెలను తీసుకొస్తుంది . అన్ని చేసిన తరువాత రాజు గారి భార్య పాయసం వండుతుంది ఆ వాసనకు ఆ కుక్క కి పాయసం తినాలనే ఆలోచనఇంకా ఎక్కువ అవుతుంది .
అంతవండి రాజుగారి భార్య ఒక్కతే తింటాది తిన్న తరువాత ఆ గిన్నె కడిగిన నీళ్లు కూడా కంపలో పోస్తుంది .
పాపం ఆ కుక్క ఆకలితో బాగా అరుస్తుంది ఆ కుక్కను అరవవద్దు అని బాగా కొడుతోంది . ఈ లోపు రాజు గారు వస్తారు కుక్క ఎందుకు అరుస్తుంది అంటే ఎం అయ్యిందో దానికి నాకేం తెలుసు అంటుంది
కుక్క చాలా బాధతో ఒక శాపం పెడుతుంది
నాకు ఏమో మనిషి పిల్లలు పుట్టాలి రాజు గారికేమో కుక్క పిల్లలు పుట్టాలని శాపం పెడుతుంది
కొన్ని రోజుల తరువాత రాజు గారి భార్య కుక్క ఒకే రోజు డెలివరీ అవుతారు రాజు గారి భార్యకు ఏమో కుక్క పిల్లలు పుడతారు,కుక్కకేమో మనిషి పిల్లలు పుడతారు .
రాజు గారు ఏడుచుకుంటూ ఆ కుక్క పిల్లల్ని వదిలేసి వస్తాడు ,

కానీ
కుక్కకి పుట్టిన మనిషి పిల్లల్ని చూసి కుక్క చాలా ఆనంద పడుతుంది .
పాపం ఆ పిల్లల్ని పెంచడానికి తను ఎంతగానో కాస్తా పడుతుంది . ఒకళ్ల ఇంటికి పోయి అన్నం ఒకలా ఇంటికి పోయి బట్టలు అన్ని తీసుకొచ్చి వాళ్ళని పెంచుతుంది .
ఆ కుక్కకి పుట్టిన ఆడపిల్లలకి 18 సంవత్సరాలు వస్తాయి . వాళ్ళు ఒక చెట్టు పైకి ఎక్కి ఆడుకుంటూ వుంటారు
వేరే ప్రాంతానికి చెందిన ఒక రాజు యొక్క కుమారులు వేటకు వస్తారు వాళ్ళు వేటాడి అలిసి పోయి ఒక చెట్టు కింద కూర్చొని వుంటారు . పైన వున్నా అమ్మాయిలు అటు ఎటు కదులుతుంటే ఆ చెట్టు ఫై నుంచి రాజు కుమారుల ఫై పుల్లలు పడతాయి ఇదేంటి ఫై నుంచి ఏదో పడుతుంది అని వాళ్ళు పైకి చూస్తారు ఆ అమ్మాయిలని చుసిన రాకుమారులు వాళ్ళ ఫై మనసు పడతారు . వాళ్ళని చూసి బయపడి వాళ్ళు కిందకు దిగి వెళ్తుండగా రాకుమారులు ఆపి పెళ్లి చేసుకుంటాం అని
అంటారు . అందరికి ఆ రాకుమారులు నచ్చుతారు అయితే అందులో చిన్న అమ్మాయి మా అమ్మ లేదు వచ్చాక చెప్పి చేసుకుంటాం అని కుక్క అయినటువంటి వాళ్ళ అమ్మ గురించి చెపుతుంది కానీ పెద్ద అమ్మాయి అమ్మ నే వస్తది మనకోసం మనం పెళ్లి చేసుకొని పోదాం అని అంటుంది .
అందరు ఒకే మాట అనే లోపు ఆ చిన్న కూతురు కూడా వాళ్ళకోసం వెళ్లాల్సి వచ్చింది కానీ వాళ్ళ అమ్మ ఇచ్చిన పూసల దండను తెంచి ఆ పూసలను దారిపొడుగునా వేసుకుంటూ పోతుంది .
పాపం సాయంత్రం అయినా కూతుర్లు రాకపోడం తో ఏడుస్తూ డోలాడుతుంది .ఆ డోలాడుతున్న క్రమం లో పూసలు కనపడి వాటిని చూసుకుంటూ పోతుంది
మొదటగా తన పెద్ద కూతురు వాళ్ళ ఇంటికి పోతుంది కానీ వాళ్ళ కూతురు అస్సలు నువ్వు ఎవరు అని తెలియనట్లుగా కర్రతో బాగా కొడుతుంది పాపం నొప్పితో ఏడుచుకుంటూ పోతుంటే ఆ కుక్క వాళ్ళ చిన్నకూతురు చూసి ఇంటికి తీసుకుపోయి స్నానం చేపించి అన్నం పెడుతుంది .

వెంటనే వాళ్ళ అక్క దగ్గరకు మన అమ్మ ఇంటికి వస్తే కొడతావా అని గొడవపెడుతుంది . అవునా నాకు తెలియక కొట్ట అని చెపుతుంది పోగరుతో
చిన్న కూతురు ఇంటికి పోయి మంచిగా అమ్మని చూసుకుంటుంది .
కొన్ని రోజుల తరువాత కుక్క నేను అక్క దగ్గరకు పోయి వస్తా చూడక చానా రోజులు అయ్యింది అని చెపుతుంది సరే అని చిన్న కూతురు అంటుంది.
ఆ కుక్క పెద్ద కూతురు వాళ్ళ ఇంటికి పోతుంది ,పెద్ద కూతురు చుసిన చూడనట్లు ఉంటుంది తరువాత night అన్నం పెడుతుంది. పాపం అది తిని ఏడుచు కుంటూ చిన్న కూతురు ఇంటికి పోతుంది, కొన్ని రోజుల తరువాత ఆ కుక్క ముసలిది అవుతుంది . అది చనిపోడానికి ముందు తన చిన్న కూతురుతో ఒక మాట చెపుతుంది ,నేను చనిపోయాక నన్ను పడియ్యకు నన్ను ఒక మూట లో కట్టి 3 రోజుల తరువాత విప్పి చూడు అని చెప్పింది .

సరే అమ్మ అని అంటుంది చిన్నకూతురు . అలా అన్న 2 రోజుల తర్వాత ఆ కుక్క చనిపోతుంది ,ఆ చిన్న కూతురు వాళ్ళ అమ్మ అయినా కుక్క చెప్పినట్లే ఒక మూటలో కట్టి దాస్తోంది . అప్పటికే ఆ రాజకుమారులు అప్పులు చేసి వున్నా ఆస్తి మొత్తం పొగుడుతారు . ఆ తరువాత చిన్న కూతురు వాళ్ళ అమ్మ చెప్పినట్లు 3 వ రోజు ఆ మూటను విప్పి చూస్తుంది ,ఆ మూట నిండా బంగారం ,వజ్రాలు ఉంటాయి .
అందులోనివి కోన్ని అమ్మేసి వాళ్ళ అప్పులు తీర్చుకొని పెద్ద బంగ్లా కట్టుకొని హ్యాపీ గా వుంటారు .
ఇది చుసిన కుక్క వాళ్ళ పెద్దకూతురు వాళ్ళ చెల్లిని అడిగితె అమ్మ చనిపోయే ముందు నాకు ఇలా చెప్పింది అని చెపుతుంది .
తన తల్లి పట్ల తను విధానాన్ని ఆలోచించుకొని తను చేసిన తప్పును తెలుసుకొని ఏడుస్తుంది .
అందుకే ఎవరికైనా చేతనయితే సహాయం చెయ్యండి కానీ అనవసరంగా మోసం చెయ్యకండి ,ఇతరుల హృదయాలను బాధపెట్టకండి