Spread the love

అనాధ పిల్లలు

వీధి పిల్లలు వారి కష్టాలు
ఇండియాలో అనాధ/వీధి పిల్లలు స్థితిగతులు వారి దారిద్యం

నగరంలోని వీధులలో జీవించే అనాధ పిల్లలని “వీధి పిల్లలు” అంటారు. వీరు కుటుంభం ఆదరణ మరియు సంరక్షణ లేనివారు. వీధులలో ఉండే చాలా మంది పిల్లల వయస్సు 3 నుండి 16 సంవత్సరాలు మధ్య ఉంటుంది, అనాధ పిల్లల జనాభా వేర్వేరు నగరాలలో వేర్వేరుగా ఉంటుంది. వదిలివేయబడ్డ భవనాలు, అట్ట పెట్టెలు,రోడ్ల పక్కన , పార్కులు మరియు వీధులలోనే ఈ అనాధ పిల్లలు జీవిస్తారు. వీధి పక్కన వుండే పిల్లల నిర్వచనం చాలా బాగా వ్రాయబడింది కాని వారికి ప్రాథమికంగా సరైన వర్గాలు లేకపోవడం ఇబ్బంది గా ఉంది. వీళ్ళలో, వీధులలో కొంత సమయం ఉండి అడుక్కొని తినే పిల్లల నుండి, పూర్తిగా వీధులలో జీవించే పిల్లలు కూడా ఉన్నారు. మరియు పెద్దవారి ఆదరణ ఆ మాత్రం లేక రోడ్ల ,మీద ఎన్నో కష్టాలు పడుతున్నారు.పట్టించుకునే వారు కూడా లేరు వాళ్ళని.
unicef (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమెర్జన్సీ ఫండ్) చే విస్తారంగా ఆమోదించిన వీధి పిల్లల నిర్వచనాన్ని రెండు వర్గాలుగా విభజించారు.

అడుక్కునే వారు కొందరు మరియు ఆదాయం కలిగించే పనుల చేసే పిల్లలు మరికొందరు . పని తరువాత చాలా మంది వాళ్ళ యజమానుల దగ్గరకు వెళ్లి వారి సంపాదనను ఇస్తారు. వారు పాఠశాలకి వెళ్ళవచ్చు లేదా వెళ్ళాక పోవచ్చు లేదా యజమానులు కింద కూలీలుగా ఉండవచ్చు కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో, ఈ పిల్లలు చివరగా వీధులలో ఉండడాన్ని ఎంచుకున్నారు.
పిల్లలు వాస్తవంగా వీధులలో జీవించవచ్చ్చు కుటుంబ సంబంధాలు ఉండవచ్చు ఉండకపోవచ్చు .

*80% కన్నా ఎక్కువ బాల కార్మికులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు, మరి ఈ సంఖ్య ఎప్పటికి అప్పుడు పెరుగుతూ వస్తుంది

*సుమారు 2,లక్షల నుండి 3లక్షల మంది పిల్లలు అనాధలుగా రోడ్ల మీద అడ్డుకున్నట్లు అంచనాలు చెపుతున్నాయి. చిన్నపిల్లల వేశ్యావృత్తిని, వ్యభిచారాన్నిఅనుసరిస్తున్నారు వాటిని భారతదేశంలోని చాల ప్రాంతాల సామాజికంగా అనుమతిస్తున్నారు.

*సామాజికంగా వెనుకబడిన కమ్యూనిటీలలో యువత ను దేవతలకు ఇచ్చి, వాళ్ళని మత సంబంధమైన వేశ్యలుగా మార్చుతున్నారు.

* ప్రోహిబిషన్ ఆఫ్ డెడికేషన్ చట్టం ప్రకారం 1982 ద్వారా దేవదాసిపధ్ధతి ని రద్దు చేసారు. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ మరియు అస్సాం వంటి చాల ప్రదేశాశాలలో వుంది .

*45% కన్నా ఎక్కువ దేవదాసిలు వేశ్యలుగా మారుతున్నారు. అందులో చాల మంది వేశ్యలు పట్టణంలో బ్రోతల్ దగ్గర పడుపువృత్తిలో చేరుతున్నారు. మిగిలివవారు అందరు గ్రామాలలో వేశ్యావృత్తిలో ఉంటున్నారు. జాతీయ మహిళల కమిషన్ ప్రకారం, మహరాష్ట్ర – కర్ణాటక సరి హద్దులో 2,45,000 స్త్రీలు దేవదాసిలుగా ఉంటున్నారని అంచనాలు వున్నాయ్ . కర్ణాటకలో బెల్గామ్ జిల్లాలో 10% దేవదాసీలకి హెచ్ ఐ వి సోకిందని 1993లో జరిపిన అధ్యయనంలో వెల్లడి చేయబడింది.
*వీధులే వారి కుటుంబం కన్నా ఎక్కువగ అని భావించే వీధి పిల్లలకి, వీధే వారికి ఇల్లులాగ ఉంటుంది. ఆ పరిస్థితులలో భాధ్యతగల పెద్దవారి నుండి రక్షణ, పర్యవేక్షణ లేదా మార్గదర్శ కత్వం ఉండదు. ఇండియాలో, సుమారు 17. 5 మిలియన్ల మంది పిల్లలు వీధులలో పనిచేయడం వాళ్ళ జీవిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ వెల్లడి చేసింది . ఈ పిల్లలలో చాలా మంది నేరాలు, గొడవలు మరియు మత్తుమందులు వంటివి అమ్మేపనుల్లోచేరుతున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *